వైసీపీ సినిమా ముగిసింది. హాస్యస్పదం గా జగన్ రాత కూత. జగన్, టి.ఆర్.ఎస్ ఫ్రంట్ కు ప్రాంతీయ పార్టీలు స్పందించలేదు. ఇంక జగన్ పని గోవిందా గోవిందా అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. చెప్పిన పధకాలతో పాటు చెప్పని పథకాలు కూడా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. జగన్ తో కలసి పీకాలనుకోని పార్టీలో చేరితే ఏమీ పీకలేరు. గతంలో వైసీపీ సీట్లు జగన్ అమ్ముకున్నడు. ఇప్పుడు కూడా అమ్మడం ఖాయం. అంతా ఓపెన్ వ్యాపారమేనని అయన విమర్శించారు. జగన్ నే మాయ. అతని మాటలు అంత అబద్ధం. 25 ఎంపీ, 160 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటామని అన్నారు. దొడ్డి దారినో గడ్డి దారినో కాదు చెప్పే పార్టీలోకి వచ్చా. మంత్రి పదవి తీసుకున్నానని అయన అన్నారు..
టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీవాసులు రెడ్డి మాట్లాడుతై సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలో ఎపి నెంబర్ 1 రాష్టం. అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్ష పార్టీ ఏమీ జరగడం లేదని ప్రచారం చెయ్యడం సిగ్గు చేటని విమర్శించారు. వైసీపీ పార్టీలోకి పోవాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి మూడు సార్లు సమావేశాలకు పిలిచినా రాజంపేట ఎమ్మెల్యే హజరుకాలేదని అన్నారు.