YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నాం

 రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నాం
చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించడం చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం నాడు ‘నీరు-ప్రగతి’పై అయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.  ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ సస్యశ్యామలం చేస్తున్నాం. మన ప్రయత్నాలు ఫలించాయి.  గతంలో మదనపల్లికి 15రోజులకోసారి నీళ్లు వచ్చేవని అయన గుర్తు చేసారు. చిత్తూరు మెట్టప్రాంతాలకు నీటి సరఫరా ఒక చరిత్ర. 
పుంగనూరు, కుప్పం,తంబళ్లపల్లి,మదనపల్లికి నీరు చేరితే కరవు అదృశ్యం.  సెరికల్చర్ ను మరింతగా ప్రోత్సహించాలి.  టమాటా హబ్ గా చిత్తూరు రూపొందాలి. అన్నిప్రాంతాలకు ‘నీరు’ ఇస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో ‘ప్రగతి’ సాధిస్తున్నాం.  మన ‘నీరు-ప్రగతి’ సత్ఫలితాలను ఇచ్చిందని అయన అన్నారు. సీమ 4జిల్లాలకు సాగునీటిని అందజేశాం.  అనంతపురం,చిత్తూరు,కర్నూలు,కడపకు నీళ్లిచ్చాం.  రాయలసీమ ఆర్ధిక స్థితి మెరుగుపడింది. హార్టీ కల్చర్ హబ్ గా రాయలసీమను చేస్తున్నాం. ఇక ఒకటే జిల్లా ప్రకాశం మిగులుతుంది.వెలిగొండ పూర్తయితే ప్రకాశం జిల్లాకు సాగునీరు. ప్రకాశం జిల్లాకు నీటి కొరత అధిగమిస్తాం. గోదావరి-పెన్నా నదుల అనుసందానం మన లక్ష్యం.  పంచనదుల అనుసందానంతో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం మొత్తం ప్రపంచం మనవైపే చూస్తోంది.  మన కృషికి అంతర్జాతీయంగా అభినందనలు. పంటలపై తెగుళ్లను నియంత్రించాం. సూక్ష్మపోషకాల లోపం నివారించాం.  వ్యవసాయంలో సంపద సృష్టి జరగాలి.  రైతుల ఆదాయాలు పెరగాలి. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. 
లోటు వర్షపాతంలో కూడా దిగుబడులు తగ్గకుండా చూశాం. 
సమర్ధ నీటి నిర్వహణతోనే పురోగతి సాధించాం.  97% రైతుల ఆదాయాలు రెట్టింపు చేశాం.  వ్యవసాయంలో 11% వృద్ధి సాధించాం. దేశవ్యాప్తంగా వృద్ధి 2%, పొరుగు రాష్ట్రంలో 0.2%మాత్రమే ఉంది. మన నదుల అనుసందానం ఒక చరిత్ర.  పట్టిసీమ దండగ అన్నవాళ్లకు సీమకు నీళ్లే సమాధానం
సమర్ధ నీటి నిర్వహణపై రైతుల్లో అవగాహన కల్పించాలి. గండ్లు కొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వడంతో ప్రతిపక్షం కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయని అన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలకు రైతులు దూరంగా ఉండాలి. చిత్తూరులో కుప్పం వరకు నీళ్లు ఇవ్వగలగాలి.  అనంతపురంలో హిందూపురం,మడకశిరకు నీళ్లు చేరాలి. మన మైక్రో ఇరిగేషన్ సత్ఫలితాలను ఇస్తోంది.  వినూత్న ఆలోచనలు, నిరంతర శ్రమతోనే ఇది సాధ్యం అయ్యింది. నీళ్లు బంగారంతో సమానం.  భూగర్భ జలాలు మన వారసత్వ సంపద. పొదుపుగా నీటిని సద్వినియోగం చేయాలి.  ప్రతి నీటి చుక్క సంపద సృష్టికి దోహద పడాలి.
నరేగాలో రూ.7,400కోట్లు వినియోగం. రూ.4వేల కోట్లు మెటీరియల్, రూ.3,400కోట్లు వేజ్ కాంపోనెట్ వుందని అన్నారు. అలాగే,  కరవు మండలాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. అదనపు పనిదినాలు సద్వినియోగం చేయాలి.  నరేగా పనులు ఎక్కడా ఆగకూడదు. అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ ఏడాది సిసి రోడ్లు 7,500 కి.మీ పూర్తిచేశాం. ఇంకా 500కి.మీ పూర్తి చేయాల్సి వుంది. అంగన్ వాడి భవనాలు, పాఠశాలల ప్రహరీగోడల నిర్మాణంపై శ్రద్ధ పెట్టాలని అయన సూచించారు.

Related Posts