YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

భోజనము అంటే అనేక పదార్ధములు కలిగిన సంపూర్ణ ఆహారము..అన్నము..!!

భోజనము అంటే అనేక పదార్ధములు కలిగిన సంపూర్ణ ఆహారము..అన్నము..!!

 శ్లోకం:
పంచతంత్రంలోనిది.

అతిథి ర్యస్య భగ్నాశో,
గృహా త్ప్రతి ని వర్తతే !
సతస్మై దుష్క్రతం దద్వా,
పుణ్య మాదాయ గచ్ఛతి !!

భావం:-
ఏగృహస్తుని ఇంటి నుండి అతిథి..
ఆకలితో వెనుతిరిగి వెళుతాడో..
అట్టి గృహస్తు చేసిన సుకృత కర్మ ఫలితాన్ని..
తీసుకు వెళుతూ తాను ఆచరంచిన  దుష్కర్మ పాపాన్ని..
ఆ ఇంటి యజమానికి(గృహస్తుకి) ఇచ్చి వెళుచున్నాడు.

భోజనము..అష్టభోగములలో ఒకటి.
అస్టభోగాలు..
1.. ధనము.
2. ధాన్యము.
3. వాహనములు.
4. భోజనము.
5. వస్త్రము.
6. వసతి.
7. స్నానము.
8. సంయోగము.

భోజనం ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం. ఇది మనం నిర్ధిష్టమైన సమయంలో తీసుకునే ఆహారం.
భోజనం సామాన్యంగా ఇంటిలో గాని, హోటళ్లలో గాని తీసుకుంటారు.
సాధారణంగా భోజనం మధ్యాహ్నం మరియు
రాత్రి సమయాలలో తీసుకుంటారు.
విందు భోజనాలు మాత్రం పుట్టినరోజు,
వివాహం మరియు శలవు దినాలలో తింటాము.
ఇందుకోసం అతిథుల్ని, స్నేహితుల్ని పిలిచి పండుగ మాదిరి చేసుకుంటాము.
భోజనం ఫలహారం కంటే భిన్నంగా ఉంటుంది.
ఇది పరిమాణంలో ఎక్కువగాను వైవిధ్యంగా కడుపు నింపేదిగా ఉంటుంది.
వన భోజనాలు అందరు కలిసి బాహ్య ప్రదేశాలలో సామూహికంగా అక్కడే తయారుచేసుకునే
విందు భోజనం. దీనికోసం ఉద్యానవనాలు,
సముద్ర తీరప్రాంతాలు మొదలైన ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు అనుకూలమైనవి.
భోజనంలో రకాలు.
మనం తినే భోజనంలో కూడా మన గుణాలను అనుసరించి మూడు రకాలు ఉన్నాయని
భగవద్గీతలో చెప్పబడింది. అవేమిటో చూద్దాం.

సత్వగుణ ప్రధానుల భోజనం:
ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః ||

ఆయుష్షును, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందింపచేసేది,
రసవంతమైనది,
చక్కగా మెరిసేది,
చూడగానే కంటికి, ముక్కుకు, హృదయానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే భోజనం సత్వగుణ ప్రధానులైన వారికి ఎంతో ఇష్టమైనది.
ముఖ్యంగా ఏ పూటకు ఆ పూట చక్కగా వండుకొని భగవంతునికి నివేదించి తీసుకునే ఆహారం సాత్వికమైనది.

రజోగుణ ప్రధానుల భోజనం:
కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః ||

ఇక చేదుగా, పుల్లగా ఉండేవి, అతిగా వేడి చేసేవి, ఎండినట్లు ఉండేవి (ఫ్రైడ్ రైస్ లాంటివి),
ఎక్కువగా వేయించినవి,
ఎక్కువగా దాహాన్ని కలిగించేవి (మసాలాలు) అయిన ఆహారాలు రజోగుణ ప్రధానులు ఇష్టంగా తింటారు.
అయితే ఇవి తినేటప్పుడు ఇష్టంగా ఉన్నా ఆ తరువాత దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి.
ఇంతకుముందు మనం రాజసిక సుఖంలో గారెల గురించి చెప్పుకున్నాం కదా.

తమోగుణ ప్రధానుల భోజనం:????
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ||

ఇక పోతే మనం ఇదివరలో చెప్పుకున్నట్లు
తమోగుణ ప్రధానులైనవారు తాము ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తమకే తెలియకుండా ఉంటారు.
అందువలన వారికి సారహీనమైనవి,
శక్తి అంతా పోయినవి, బూజు పట్టినవి,
ఎంగిలివి, అసలు తినకూడనివి అయిన పదార్థాలు
కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి.
ఈ రోజులలో ఓపిక, తీరిక లేని జీవితాలతో మనం ఒకరోజు వండుకుని, ఫ్రిజ్ లో పెట్టుకుని,
పది రోజులపాటు తినేవన్నీ ఇలాంటివే
ఈ విధంగా మనలో ఉన్న గుణాలు మనం తినే ఆహారంయొక్క స్వభావాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో అలాగే మనం తినే ఆహారం కూడా మనలో ఆయా గుణాలను ప్రేరేపిస్తూ ఉంటుంది.
ఓం నమః శివాయ..!!

Related Posts