పోలవరానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పోలవరం నిధుల విడుదలపై లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.3,722 కోట్లు తక్షణం విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.10,459 కోట్లు ఖర్చు చేయగా కేవలం రూ.6,727 కోట్లు మాత్రమే ఇచ్చారని, గత జులైలో పోలవరంలో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటించినప్పుడు ఫిబ్రవరిలోపు నిధులు మొత్తం విడుదల చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంలో ఎంతవరకు మాట మీద నిలబడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు.