పెన్షన్ రూ.2వేలకు పెంపుపై ప్రజల్లో పెద్దఎత్తున సంతృప్తి ఉంది. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో పించన్ల పండుగ నిర్వహిస్తాం . రాజమండ్రిలో బీసీ జయహో సదస్సు ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలి. ఈ నెల 30నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. నాలుగున్నరేళ్లలో మనం ఏం చేశామో చెబుతాం. భావి అభివృద్ది ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్తాం’’ అని చంద్రబాబు చెప్పారు.