YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శివకుమార స్వామీజీ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

శివకుమార స్వామీజీ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
కర్ణాటకలోని సిద్ధగంగా మఠాధిపతి డాక్టర్‌ శివకుమార స్వామీజీ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా ఎంతో మంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆధ్యాత్మిక వేత్త అయిన శివకుమార స్వామీజీ మరణం ఎంతో బాధించింది. విద్య, వైద్య రంగాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. అసంఖ్యాకులైన ఆయన అనుచరులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సంతాపం తెలిపారు. ‘ గతంలో సిద్ధగంగా మఠాన్ని సందర్శించి శివకుమార స్వామీజీ ఆశీర్వాదం తీసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సమాజానికి ఎంతో సేవ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
‘శివకుమార స్వామీజీ మరణ వార్త వినడం చాలా బాధాకరం. కోట్లాది మంది భారతీయులు, అన్ని వర్గాలు, మతాల ప్రజలు ఆయనను ఎంతో గౌరవిస్తారు. ఆయన లేకపోవడం ఆధ్మాత్మికంగా ఎంతో లోటు. ఆయన అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి’-కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.   ‘శివకుమార స్వామీజీకి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా. ఆ బిరుదుకు ఆయన చాలా అర్హత గల వ్యక్తి. కర్ణాటకకు చెందిన చాలా గొప్ప వ్యక్తి’ -కాంగ్రెస్‌ నేత మల్లికార్జున‌ ఖర్గే పేర్కొన్నారు.111ఏళ్ల స్వామీజీ అనారోగ్యంతో గత రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. కర్ణాటక ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఇచ్చింది.స్వామీజీ మృతితో విషాదంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, భాజపా నేత యడ్యూరప్ప రాజకీయ విబేధాలు పక్కన పెట్టి కలిసి మీడియా సమావేశంలో ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్వామీజీకి గతంలో పద్మ భూషణ్‌ అవార్డు లభించింది. రేపు స్వామీజీ అంత్యక్రియలు జరగనున్నాయి. తుమకూర్‌లోని మఠానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.‘ 

Related Posts