YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం ఉదయం మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడే ఉన్న పంప్ హౌస్ అగ్నికి ఆహుతైంది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇది నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన రెండో ప్రమాదం. ఈ ప్రమాదంపై స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.కోట్లలో ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, మంటలను అదుపు చేయడంతో ఆస్తి నష్టం తగ్గిందని అన్నారు. అలాగే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. మరోపక్క, రెండ్రోజుల క్రితం ప్లాంట్ లోని ఫర్నేస్-3లో ఉన్న బ్లోపైప్ పేలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నెస్-3లో ఒత్తిడి కారణంగా బ్లో పైప్ పేలిపోయి, భారీ శబ్థంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమీపంలోని ఐదు ద్విచక్రవాహనాలపై ద్రవంలో ఉక్కు పడి దగ్థమయ్యాయి. బ్లోపైప్ పేలిడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో మరమ్మత్తులు చేపట్టిన తర్వాత ఉత్పత్తి తిరిగి ప్రారంభించగా మళ్లీ సోమవారం మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గురువారం జరిగిన మూడో ఫ‌ర్నేస్‌లో ప్ర‌తి రోజు 8వేల మిలియ‌న్ ట‌న్నుల ఉక్కును ఉత్ప‌త్తి చేస్తారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల వ్య‌క్తిగ‌త విచార‌ణ చేప‌ట్టాల‌ని ఐఎన్‌టీయూసీ డిమాండ్ చేసింది. 

Related Posts