YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి మోడీ చేసిన సాయం ఎవ్వరూ చేయలేదు

ఏపీకి మోడీ చేసిన సాయం ఎవ్వరూ చేయలేదు
దేశ ప్రధానులుగా ఇప్పటి వరకు పనిచేసిన ఎవరి హయాంలోనూ అందనంత సాయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అందించిందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి అన్నారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలుంటే లెక్కలతో సహా చెప్పగనని టీడీపీ నాయకులకు సవాల్‌ విసిరారు. కేవలం రోడ్లు, పోర్టుల నిర్మాణానికి నా శాఖ నుంచే ఏపీకి 25 వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. కేంద్రం ఆర్థిక పరంగా రాష్ట్రానికి చేయాల్సినంత సాయం చేస్తోందని, ఎంతచేస్తున్నా రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమీ చేయడం లేదంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీకి పెద్దఎత్తున నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏపీకి మోదీ సర్కారు ఎంతో చేసిందని, ఈ ఐదేళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగమని వ్యాఖ్యానించారు. సాగరమాల ప్రాజెక్టు కోసం లక్షా 64 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు కేంద్రమే అందజేస్తుందని తెలిపారు. గోదావరి మిగులు జలాలను తమిళనాడుకు అందజేస్తామని, గోదావరి, కృష్ణ‌ా, పెన్నా నదుల అనుసంధానం పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో జాతీయ రహదారులను పెద్ద ఎత్తున విస్తరించామని, నెల్లూరు-చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్ తీసుకొస్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవధారగా అభివర్ణించారు. పాత మిత్రులు తమను నిత్యం విమర్శిస్తున్నారని టీడీపీపై పరోక్షంగా వాగ్బాణాలు సంధించారు. రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని, దీనిపై చర్చకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా అని నితిన్ గడ్కరీ సవాల్ విసిరారు. ఇదే సమావేశంలో పురందరేశ్వరి మాట్టాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన పూర్తిగా అవినీతిమయమైందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. పోలవరం తానే కట్టేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారని, కేవలం 4 వేల కోట్లు రాలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రధానిగా కాకుండా ప్రజా సేవకుడిగా ఉన్నారని, కేంద్రం పథకాల వల్లే అందరికి సంక్షేమం అందుతోందని అన్నారు. జీఎస్టీ అమలు వల్లనే తక్కువ ధరకే వస్తువులు లభిస్తున్నాయని పురందరేశ్వరి పేర్కొన్నారు. 

Related Posts