విలక్షణ నటుడు కమల్‌హాసన్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అవినీతి ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం దేశ ప్రజలను ఆలోచింపజేసింది. 1996లో విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కమల్‌హాసన్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తెచ్చిపెట్టింది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ప్రధాన పాత్రలో కమల్‌హాసన్ నటిస్తుండగా, కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ‘భారతీయుడు-2’కి సంబంధించి ఓ వార్త ఆసక్తిగా మారింది. బాలీవుడ్ బిగ్‌బీ కొడుకు, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. శంకర్ పాత్ర గురించి చెప్పగానే జూనియర్ బచ్చన్ వెంటనే ఒప్పేసుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. శంకర్ సినిమాలంటే బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు-2’కి మరింత క్రేజ్ తెచ్చేందుకు అభిషేక్ బచ్చన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షయ్‌కుమార్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అటు చిత్ర యూనిట్‌గానీ, ఆ నటులు గానీ స్పష్టత ఇస్తేనే అసలు నిజం తెలిసేది. శంకర్, రజనీ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన ‘2.0’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏకంగా రూ.700కోట్లు గ్రాస్ వసూలు చేసి శంకర్, రజనీ స్టామినాను ప్రపంచానికి మరోసారి చాటింది. 2.0లో అక్షయ్‌కుమార్ తనదైన స్టైల్లో విలనిజం పండించారు.