ఇండియా, టిబెట్ ల సంస్కృతి ఒక్కటే. ఈ దేశ సంస్కృతీ అక్కడ కూడా ఉంది. ఇండియాలో ఉన్న విద్య ,వైద్యం విధానం అనేక వేల సంవత్సరాలు నుండి వస్తుందని టిబెటన్ గవర్నమెంట్ డిప్యూటీ స్పీకర్ ఆచార్య యెషి ఫున్ స్తోక్ అన్నారు. సోమవారం నాడు విజయవాడ సిధార్థ ఫార్మసి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడారు. చైనా అక్రమించిన తర్వాత చైనా ప్రభావం టీబెటర్ మీద పడుతుంది. మా స్వాతంత్ర్య హక్కులు కోసం ఇండియా ప్రభుత్వం సహకారం ఇస్తుంది. ఇది కొనసాగే కొనసాగాలని కోరుతున్నా. టిబెట్ కి మళ్ళీ స్వతంత్రం రావాలని కోరుతున్నానని అయన అన్నారు. టిబెట్ ప్రజలు ఎంతోమంది ఇండియాలో బతుకుతున్నారు. ప్రపంచం మొత్తం మీద టిబెట్ అంటే సానుభూతి ఉంది. టిబెట్ లో ఉన్నవారు చైనా వారు కాదు. అక్కడ ప్రభుత్వ విధానాల ప్రభావం మాపై పడుతుంది. టీబెట్ బోర్డర్ ని ఆక్రమించి ఇండొచైనా బోర్డర్ గా మార్చారని అయన ఆరోపించారు. టిబెట్ స్వాతంత్రం కోసం భారతీయుల సహకారం కావాలని అయన కోరారు.