ప్రకాశంజిల్లా ఇంకొల్లులో ఎంఆర్ ఆర్ పాఠశాలలో టెన్త్ క్లాసు చదువుతున్న ఓ బాలికపై కరస్పాండెంట్ వీరయ్య లైంగిక వేధింపులు పాల్పడటం ప్రకాశంజిల్లాలో సంచలనం రేపింది. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పై కన్నేసిన ఉపాద్యాయుడు జిత్తులమారి ఎత్తులను ప్రయోగించి మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. ఇలాగత కొంతకాలంగా తన కామ వాంఛతో మానవత్వం మరచి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటం తో విద్యార్థిని గర్భం దాల్చింది. సంక్రాంతి సెలవులు నిమిత్తం హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళిన విద్యార్థిని సెలవులు ముగిసిన అనంతరం తిరిగి స్కూల్ కు వెల్లెందుకు నిరాకరించడంతో తల్లిదండ్రులు గట్టిగా అరతీశారు. అప్పటికే ఆరోగ్య సమస్యలతో లో..లోపల మదన పడుతున్న బాలిక తల్లిదండ్రులు నిలతీయడంతో జరిగిన విషయాన్ని వివరించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో చెకప్ చేయించగా తమ కూతురు గర్భవతిగా తేలింది.దింతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వీరయ్య అక్కడనుండి పరారయ్యాడు. జరిగిన ఘటనపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఇంకొల్లు పోలీసులకు పిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిర్భయ తో పాటు పలు సెక్షన్లపై కేసునమోదు చేశారు. నిందితుడు వీరయ్యను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు.