YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను రాయితీలు

 ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను రాయితీలు
పేద మధ్యతరగతి ప్రజల స్వయం ఉపాధి కార్యక్రమాల నైపద్యంలో వారికి అండగా ఉండేందుకు ఆటో పాసింజర్ వాహనాలకు ఆటో మూడు చక్రాల రవాణా వాహనాలకు వ్యవసాయం నిమిత్తం ఉపయోగించే ట్రాక్టర్ మరియు ట్రైలర్లకు పన్ను రాయితీ మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించడం జరుగుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక బందరురోడ్డు లబ్బిపేటలో మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారంనాడు రవాణాశాఖ నాన్ టెక్నికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి మణికుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘ నాయకులు జోనల్ నాయకులు రవాణాశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును కలిసారు. రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోన్2 రూపొందించిన 2019 గోడ కాలమానిని మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉద్యోగులు రూపొందించిన క్యాలెండర్ ఎంతో ఆకర్షణీయంగా ఉపయోగకరంగా తీర్చిదిద్దారని ఆయన అన్నారు.  పూర్తి పారదర్శక విధానాల పరిపాలనందించిన రవాణాశాఖలో ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానానికి రవాణాశాఖ ఉద్యోగులు సహకారం ఇతర శాఖలకు ఆదర్శంగా ఉందని ఆయన అన్నారు. శాఖ పరమైన లక్ష్యాలను చేరుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వామి ఉందన్నారు. ఆటో పాసింజర్ వాహనాలు, మూడు చక్రాల రవాణా వాహనాలు నడిపేవారు ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారై ఉంటారని, వారి శ్రేయస్సు దృశ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  వారి చెల్లించే పన్నులలో ప్రోత్సాకారం అందించాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు అందులో భాగంగా సోమవారం నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు.
        ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి. మణికుమార్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్, కోశాధికారి ఏ.మదాని, ఉపాధ్యక్షుడు కె.వి.ఎన్.వి.ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాకేష్ మధుకర్ బాబు, నాలుగు జోన్ల అధ్యక్షులు వి.ఏ.కృష్ణ మోహన్, యం.రాజుబాబు, అబ్దుల్ కరీమ్, లక్ష్మీకర రెడ్డి, కిషోర్, పైడిరాజు మరియు సంఘ నాయకులు చంద్రశేఖర్, అబ్దుల్ లతీఫ్, నాగ మురళి, సత్తిబాబు, అబ్దుల్ సత్తార్ పాల్గొన్నారు.

Related Posts