YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలోకి చరణ్ రాజు

టీడీపీలోకి చరణ్ రాజు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కడప జిల్లాలో టీడీపీ తరపున రాజంపేట నుంచి గెలిచిన ఎకైక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి కొంత కాలంగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే మేడా మంతనాలు జరుపుతున్నారన్న సమాచారం పార్టీలో జోరుగా చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేడాను ఆహ్వానించకుండానే రాజంపేట నియోజకవర్గ టీడీపీ సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం ఆదేశాలను పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుండటంతోనే ఎమ్మెల్యేను సమావేశానికి ఆహ్వానించలేదంటూ ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఆరోపించారు.ఇరు వర్గాలు బాహా బాహీకి దిగారు. ఎమ్మెల్యే వర్గీయులు సమావేశాన్ని బహిష్కరించారు. మేడా మల్లికార్జున్ పై వర్గీయులపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటావో పార్టీ మారుతావో తేల్చుకోవాలంటూ ఎమ్మెల్యే మేడాకు సూచించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. టీడీపీలో కొనసాగేట్లయితే పార్టీ సమావేశాలకు రావాలి లేదంటే పార్టీ వీడి వెళ్లిపోవచ్చని కామెంట్ చేశారు. దీంతో మేడా మల్లికార్జున్ పార్టీ నుంచి వెళ్లిపోతారనే సంకేతాలు ఉండటంతో, తెలుగుదేశం కొత్త నేత కోసం చూస్తుంది. మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో తెదేపా కొత్త నేతలను తెరపైకి తీసుకొస్తోంది. రెడ్‌ బస్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గ తెదేపా నేతలంతా రేపు అమరావతిలో సీఎం చంద్రబాబును కలవనున్నారు.పరిణామంతో మేడా అవాక్కయ్యారు. ఈనెల 22వ తేదీలోపు సీఎం చంద్రబాబునాయుడును కలిసి నా బాధలను వివరిస్తానని, ఆ తర్వాతే భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… నన్ను పార్టీకి దూరం చేసేందుకే మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం పెట్టారన్నారు. నాకు ఆహ్వానం లేకుండా సమావేశం నిర్వహించారన్నారు. నేను పార్టీ మారుతున్నానని ప్రచారం చేశారన్నారు. ఎవరితో సంప్రదింపులు జరపకపోయినా నాపై అబాండాలు వేస్తున్నారన్నారు. నన్ను అవమానించే విధంగా మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడారన్నారు. రాజంపేట నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.

Related Posts