YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రైతు బంధు పథకం

 ఏపీలో రైతు బంధు పథకం

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తెలంగాణ లో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎపి సర్కార్ అమలు చేయాలనీ యోచిస్తోంది. టి సిఎం కార్యక్రమాలను అటు ఇటుగా మార్చి అమల్లో పెడుతున్న టిడిపి సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం కార్యక్రమాన్ని త్వరలో ప్రకటించడానికి రూప కల్పన చేస్తుంది. ఈ పథకాన్ని మక్కి కి మక్కి కాపీ కొట్టేశారనే అపవాదు రాకుండా కౌలు రైతులకు కూడా పంట పెట్టుబడి అందించాలన్న ఆలోచన చేస్తుంది. తెలంగాణ లో రైతులకు మాత్రమే కెసిఆర్ సర్కార్ రైతుబంధు పథకం కింద పెట్టుబడి అందిస్తుంది. రైతులు కౌలు రైతులు ఒక అవగాహన తో ఈ సొమ్ములు పంచుకోవాలని వారిద్దరిమధ్య పంచాయితీ ల బాధ్యత సర్కార్ ది కాదని తేల్చేసింది.అయితే రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించడం కత్తిమీద సాముగా కనిపిస్తుంది. పంట పంటకు కౌలు రైతులు మారిపోతూ వుంటారు. వీరిని గుర్తించి పెట్టుబడి సాయం అందించే క్రమం చాలా సమస్యలు తెచ్చి పెడుతుంది. అక్రమాలు విచ్చలవిడిగా జరిగే అవకాశాలు వున్నాయి. కౌలు రైతులకు సొమ్ములు ఇస్తే భూమి సొంతంగా వున్న వారు తమ భూములపై వారికి హక్కులు ఏమన్నా సంక్రమించి ఆక్రమిస్తారేమో అన్న ఆందోళన చెందుతున్నారు.కౌలు రైతుల చట్టం కిందకు రాకుండా ప్రతి రైతు తమ పొలాలను సాగు చేయడానికి పక్కాగా రాతకోతలు చేసుకుని ఒక పంట లేదా ఒక ఏడాది కి మాత్రమే కౌలు ఇస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో అటు రైతులకు ఇటు కౌలు రైతులకు సర్కార్ ఒకే విధంగా సాయం చేస్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైతులకే ఈ పథకం వర్తింప చేస్తే కౌలు రైతుల్లో, అలా కాకుండా ఇద్దరికి ఇచ్చే పక్షంలో భూ యజమానులకు అసంతృప్తి పెల్లుబికి ఏటో ఒక ఓటు బ్యాంక్ కి చిల్లు పడుతుందన్న ఆందోళన పసుపు వర్గాల్లో మొదలైంది. దాంతో కేసీఆర్ రూట్ లో వెళ్లడమే మేలని కూడా కొందరు సూచిస్తున్నారని తెలుస్తుంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి అన్నదాతల్లో, పార్టీ వర్గాల్లో నెలకొంది.

Related Posts