YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీలో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్

బీజేపీలో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు బిజేపిలోను మొదలయిపోయాయి. విశాల ప్రజాస్వామ్య పార్టీగా ప్రచారం వుండే కాంగ్రెస్ లో నేతలు తమ వాక్ స్వాతంత్య్రాన్ని బాగా వాడి పార్టీ ని ఇక్కట్లు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు బీజేపీలో కూడా అదే ధోరణి ప్రబలుతోంది. తమ పదునైన వ్యాఖ్యలతో ఇప్పుడు బిజెపికి చెందిన ఇద్దరు మహిళలు కమలనాధులకు చిక్కులు తెచ్చి పెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ మహిళా నేతలు చేసిన వ్యాఖ్యలు రచ్చకు కారణమే కాదు, చర్చనీయాంశంగా మారాయి.బిజెపి యుపి ఎమ్యెల్యే సాధనాసింగ్ మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక సభలో ఆమె మాట్లాడుతూ మాయావతి ఆడ కాదు, మగ కాదు అంటూ దుమ్మెత్తిపోశారు. యుపిలో తనను తీవ్రంగా అవమానించిన సమాజ్ వాదీ పార్టీ తో అధికార దాహంతో దాసోహం అని స్త్రీ జాతి పౌరుషాన్ని దిగజార్చారన్నారు . కౌరవ సభలో తనకు జరిగిన అవమానానికి ద్రౌపది దుశ్శాసునుడిని అంతమొందించే ప్రతిజ్ఞ చేస్తే మాయ దీనికి పూర్తి భిన్నంగా ఆమె వ్యవహరించారన్నది సాధన విమర్శ. అయితే ఈ విమర్శలు తీవ్ర దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఆమెకు నోటీసులు జారీచేసింది.చత్తిస్ ఘడ్ ఎంపి సరోజ్ పాండే వ్యాఖ్యలు మరో దుమారం సృష్ట్టించాయి. గతంలో రాహుల్ ఉహు లాభం లేదన్న ఆమె ఇప్పుడు విపక్ష నేతపై ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ రాణిస్తున్నారని సరోజ్ పాండే చెప్పడం కమలానికి కలవరపాటుకు గురిచేసింది. మరోవైపు బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా ఇటీవల కోల్ కత్తాలో జరిగిన ర్యాలీకి హాజరై మోదీని విమర్శలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. అసలే మూడు రాష్ట్రాల పరాజయంతో ఢీలా పడ్డ బిజెపి తాజాగా కమలం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడటం విశేషం.

Related Posts