యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చదువులఒడి కార్యక్రమం వెబ్ సైట్ ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాలవ శ్రీనివాసులు, పి.నారాయణ కుడా పాల్గోన్నారు. మంత్రి శ్రీనివాస రావు మాట్లాడుతూ బడి బయట వున్న బాలికలను మళ్లీ బడిలోకి రప్పించెందుకు వుద్దెశించి అమలుచేస్తున్న కార్యక్రమం చదువుల ఒడి అని అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు చొరవతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. బాలికలను మళ్లీ బడికి రప్పించడంలో యీ కార్యక్రమం ద్వారా గత మూడు సంవత్సరాలుగా సత్ఫలితాలు వుంటాయని అన్నారు.