యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
‘మీటూ’ విషయమై పోరాడేందుకు కంగన ఎప్పుడూ ముందుంటారు. గతంలో ఆమె హృతిక్ రోషన్, నిర్మాత వికాస్ బెహెల్ తన పట్ల ప్రవర్తించిన తీరును చెప్పారు. తాజాగా ‘మణికర్ణిక’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా తన పట్ల జరిగిన మరో అసభ్యకర ఘటన గురించి వెల్లడించారు. పబ్లిక్‌లోనే ఓ వ్యక్తి తనను గిల్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని అన్నారు. ‘మీటూ ప్రభావం చిత్ర పరిశ్రమలో బాగా ఉంది. నటీమణులతో పిచ్చివేషాలు వేసే వారు ఇప్పుడు అలా ప్రవర్తించడానికి ఆలోచిస్తున్నారు. ఆడపిల్లలు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి భద్రతకు వారే బాధ్యులు. ఓసారి ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి నన్ను గిల్లాడు. అతను నా వెనకే నిలబడి ఉన్నాడు. ‘ఇప్పుడేం చేయగలవ్’ అన్నట్టుగా అతను చూసిన చూపు నాకెంతో చిరాకు కలిగించింది అని ఆమె చెప్పారు.