YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రివర్గ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి

మంత్రివర్గ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేబినెట్ భేటీలో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం  ఉదయం ఎలక్షన్ మిషన్-2019పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ  గతంలోనే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానాన్ని పంపామన్నారు. ఈ డబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం, ఇతరులకు ఐదు శాతం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. పెన్షన్ల రెట్టింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎన్నికలలో ఉపయోగించే ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో రుజువులు చూపారన్నారు. ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావులేదన్నారు. ఓటు ఎవరికి పడిందనే సంశయం ఉండకూడదన్నారు. టీడీపీ పోరాటం వల్లే వీవీ ప్యాట్ రశీదులు వచ్చాయని, అన్నారు. అయితే, వీవీ ప్యాట్ కూడా 100 శాతం నియోజకవర్గాల్లో అమలు లేదని పేర్కొన్నారు. వీటన్నింటిపై 22 పార్టీల ప్రతినిధులతో త్వరలోనే ఈసీని కలుస్తామన్నారు. అలాగే,  అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250కోట్లు ముందస్తు చెల్లింపు ఉంటుందని, మిగిలినవారికి కూడా హైకోర్ట్ ఆదేశాల ప్రకారం న్యాయం చేస్తామని తెలిపారు. ఆటోలపై జీవితకాల పన్ను, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. మంజూరు కాకుండానే ఇల్లు కట్టుకున్న పేదలకు 60వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు అన్నారు. ఆర్డీవో ద్వారా చుక్కల భూముల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం అన్నారు. 

Related Posts