యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 49వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని అధికారుల బృందం చేరుకుంది. తరువాత ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందంతో మంత్రి భేటీ అయ్యారు. మంగళవారం జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక పై జరిగే సమావేశాలు,వివిధ పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాల పై అధికారులతో చర్చించారు. వివిధ సమావేశాల్లో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్,వ్యవసాయ రంగం ప్రభుత్వ సలహాదారుడు టీ.విజయ కుమార్, ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణకిషోర్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు, సమాచార శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు, వైద్య శాఖ సలహాదారుడు డాక్టర్ జితేందర్ శర్మ పాల్గొన్నారు.