YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కులాల చిచ్చు చరిత్ర చంద్రబాబుది

కులాల చిచ్చు చరిత్ర చంద్రబాబుది
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. సదస్సులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తాం. మోడి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, బిజేపి సిద్దాంతాలు యువతకు వివరిస్తామని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పార్టీ కార్యక్రమం పై యువమోర్చాకు దిశానిర్దేశం చేసేందుకు ఆఫీసు బ్యారర్స్ సమావేశం ఏర్పాటు చేశాం. మార్చి 2 వ తేదీ వరకు ఎపి లోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం మాకు చేత కాదని అయన అన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వస్తున్న అనేక డిమాండ్లను పరిగణలోకి తీసుకుని మోడి రిజర్వేషన్లు ప్రకటించారు. అగ్ర వర్ణాలలో ఉన్న పేదలకు మంచి అవకాశం కల్పించడం ద్వారా వారి తలరాతను మోడి మార్చారు. గతంలో మాల, మాదిగల మధ్య, కాపు, బిసిల మధ్య గొడవ పెట్టిన చరిత్ర చంద్రబాబు ది. తాను అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎంత నీచానికైనా పాల్పడతారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి.. మరోసారి బాబుకు అవకాశం ఇస్తే ఎపిని, ప్రజలను ఎవరూ కాపాడలేరు. ఎపి లో శాంతి భద్రతలు క్షీణించాయి, పోలీసుల అండతో ప్రతిపక్షాల పై భౌతిక దాడులు చేస్తున్నారు. మా ఇంటి మీదకు వచ్చిన వారంతా రౌడీ షీటర్లే.. వారు ఎందుకు వచ్చారు. అదే అంశాన్ని వివరిస్తూ నేను  లేఖ రాశానని గుర్తు చేసారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయంలో ఆ గట్టు, ఈ గట్టుకు మారే వారు ఉంటారు..అది సహజం. మా పార్టీ నుంచి వెళ్లే వారు ఉన్నారు, చేరే వారు ఉన్నారు చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశాడు..అవన్నీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్ లు అన్న బాబు కమిటీ పేరుతో కాలయాపన చేసింది వాస్తవం కాదా. చంద్రబాబు చెప్పేవన్నీ అసత్యాలేనని ఆ పార్టి నేతలే బహిరంగంగా మాట్లాడుతున్నారు. 3200కి.మి జాతీయ రహదారులు కేంద్రం ఇచ్చిందని అయ్యనపాత్రుడే ప్రకటించారు. మా పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్గా గా చంద్రబాబు బిజెపి కి బాగా ప్రచారం చేస్తున్నారు.. చాలా సంతోషమని కన్నా అన్నారు.

Related Posts