YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలోకి 10 శాతం కాపులకు రిజర్వేషన్

ఏపీలోకి 10 శాతం కాపులకు రిజర్వేషన్

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ల కోసం తీసుకొచ్చిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతాన్ని కాపులకు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఐదు శాతమే ఇస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ ప్రకటన చేశారు. కాపులకు మరో ఐదు శాతం ఇవ్వాలని ఎన్నాళ్లుగానో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా బీజేపీ నేతలు అంగీకరించలేదు. అందుకే ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్రం ఇస్తున్న పది శాతం కోటాలో ఐదు శాతాన్ని కాపులకు ఇవ్వాలని నిర్ణయించాం అని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని 2014 ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చింది. 2017, డిసెంబర్ 2న కాపు రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించింది. కాపులను వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ షెడ్యూల్ 9లో చేర్చాలని కోరింది. అయితే రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించుతుందన్న కారణంగా కేంద్రం అంగీకరించలేదు.

Related Posts