YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్నికల తర్వాతే కాంగ్రెస్‌తో పొత్తు నిర్ణయం

ఎన్నికల తర్వాతే కాంగ్రెస్‌తో పొత్తు నిర్ణయం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెస్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నామని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాం’ అని అఖిలేశ్‌ చెప్పుకొచ్చారు.ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. ‘అది ఇప్పుడే చెప్పలేం. ఎన్నికల తర్వాతే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ భారతీయ జనతాపార్టీ ఓటమే లక్ష్యంగా తమ వైరాన్ని సైతం పక్కనబెట్టి సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. కాగా ఈ కూటమి నుంచి కాంగ్రెస్‌ను దూరంగా పెట్టాయి. అయితే కాంగ్రెస్‌ మీద తమకు గౌరం ఉందని, కానీ ఎన్నికల్లో లెక్కలను సరిచేసేందుకే  ఆ పార్టీని పక్కనబెట్టాల్సి వచ్చిందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు.పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలో కోల్‌కతా వేదికగా ఇటీవల ప్రతిపక్షాల ఐక్యతా ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన అఖిలేశ్‌ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన యూపీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. ‘భాజపా తరచూ కులాల గురించి ప్రస్తావిస్తోంది. అందుకే మేం కూడా ఎన్నికల లెక్కలను సరిచేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్‌ కోసం రెండు సీట్లను వదిలేశాం. అయినప్పటికీ కాంగ్రెస్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాం’ అని అఖిలేశ్‌ చెప్పుకొచ్చారు.ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. ‘అది ఇప్పుడే చెప్పలేం. ఎన్నికల తర్వాతే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. తమ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఎన్నికల లెక్కలు సరిగా లేకపోవడం వల్లే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిందని అఖిలేశ్‌ అన్నారు. అది పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ మహాకూటమిని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.ఇక ప్రధాని అభ్యర్థిగా మాయావతి లేదా మమతా బెనర్జీ.. ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతిస్తారని మీడియా అడగగా నేరుగా సమాధానం చెప్పేందుకు అఖిలేశ్ నిరాకరించారు. మహాకూటమి ప్రధాని అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని, ఎన్నికల తర్వాతే దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు.

Related Posts