యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో కార్పొరేట్ ప్రయోగాలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెడుతోంది. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కురిపించే పంటలను మన రైతుల చేత పండించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.అందుకోసం సమాచార మార్పిడి, సర్వేలు నిర్వహించేందుకు పలు ప్రైవేటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) సంస్థలను రంగంలోకి దించేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. వ్యవసాయరంగంలో డిజిటలైజేషన్, ఆన్‌లైన్ సేవలు అనే ముద్దుపేరు పేరుపెట్టింది. ఇప్పటికే ఎనిమిది సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. పైలెట్ ప్రాజెక్టులను జిల్లాల వారీగా కేటాయించింది. జిల్లా కలెక్టర్లు సమర్ధవంతంగా అమలు చేయాలని ఇటీవలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. సమన్వయకర్తలుపంటల సాగు విస్తీర్ణం, అంతర్జాతీయంగా, జాతీయంగా వ్యవసాయోత్పత్తుల ధరల్లో చోటుచేసుకునే మార్పులు, గిరాకీ తదితర అంశాలపై ఇటు రైతులను అటు కార్పొరేట్ సంస్థలను ప్రతిపాదిత ఐటి సంస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాయని సర్కారు పేర్కొంటోంది. అంతేకాకుండా సేద్యానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వాడకంపై రైతులకు సలహాలు, విస్తరణ సేవలను రైతులకు అందుబాటులోకి తెస్తాయని చెపుతోంది.నాణ్యమైన వ్యవసాయోత్పత్తుల సాధనపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాయట. పంట కోతల అనంతరం అవి చెడిపోకుండా నిల్వ చేసే పద్ధతులు, అందుకు మౌలిక సదుపాయాలు, పంటల సేకరణ వీటన్నింటినీ సదరు ఐటి సంస్థలు రైతులు, కార్పొరేట్ సంస్థల మధ్య ఆన్‌లైన్‌లో అనుసంధానం కావిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతులకు, కార్పొరేట్లకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తాయట. ప్రభుత్వరంగంలో విస్తరణ సేవలు నానాటికీ తీసికట్టు అన్నట్లున్నాయి. విస్తర ణాధికారుల పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన మల్టీ పర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల వ్యవస్థలో రైతు సంక్షేమం కంటే రాజకీయ జోక్యం అధికంగా ఉంది. చాలా మండలాలకు శాశ్వత ప్రాతిపదిక వ్యవసాయా ధికారుల్లేరు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఎడి), డిప్యూటి డైరెక్టర్ (డిడి) పోస్టులు సైతం ఖాళీ. ఒక్క వ్యవసాయశాఖలోనే కాదు ఆ శాఖకు అనుబంధంగా ఉండే మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, పౌరసర ఫరాలు, హార్టికల్చర్, ఫిషరీస్, సహా డిపార్టు మెంట్లలో రెగ్యులర్ నియా మకాల్లేవు. దీంతో రైతులు ప్రైవేటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణ ాలు, ఆయా కంపెనీల ఏజెంట్ల సూచనలతో వ్యవసా యం చేసి దోపిడీకి గురవుతున్నారు. తీరని నష్టాల పాలవుతు న్నారు. ప్రభుత్వరంగంలో రైతుల కు సలహాలి వ్వాల్సింది పోయి ప్రైవేటు ఐటి సంస్థలను రంగంలోకి దించి వాటి ద్వారా విస్తరణ సేవలు, పంటల మార్కెటింగ్, ఉత్పాదకాల వాడకం తదితరాలను ఆన్‌లైన్‌లో అందు బాటులోకి తీసుకురా వడంకార్పొరేట్, కంపెనీ సాగును ప్రవేశపెట్ట డానికేనన్న ఆరోపణ లొస్తున్నాయి. ఈ వ్యవహారానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అని పేరు పెట్టారు.