Highlights
- నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
- అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనం
- మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిన పీఎన్‌బీ స్కామ్
దేశీయ మార్కెట్ల పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం ఎఫెక్ట్ పడటంతో నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 180 పాయింట్లు కోల్పోయి 33,830 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 10,404 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ కూడా 10,400 దిగువకు పడిపోయింది. ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్, తదితర బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ,ఎస్‌బ్యాంక్, యూనియన్ బ్యాంక్, టాటా స్టీల్ (5శాతం) నష్టాల్లో ఉండగా, జెట్ ఎయిర్‌వేస్ , అల్ట్రా టెక్‌సిమెంట్, అంబూజా లాభపడుతోంది. ఎయిర్‌వేస్ సెక్టార్ తప్ప దాదాపు అన్నిసెక్టార్లు నష్టాల్లోనే ఉన్నాయి. భారీ అమ్మకాల ఒత్తిడితో మెటల్, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంకింగ్ నష్టపోతున్నాయి. పీఎన్‌బీ తో 3శాతంగా నష్టపోయింది.