యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బెజవాడ రాజకీయాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ నాయకులు కొంత మేరకు దూకుడు ప్రదర్శిస్తారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతారు. పైగా ఇక్కడ మొత్తం క్లాస్ కాదు. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. క్లాస్, మాస్ కలిసి ఉన్న నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. బెజవాడలోని మొత్తం మూడు నియోజకవర్గాల్లోనూ సెంట్రల్‌కు ఉన్న తేడా వేరు. ఇక్కడి మాస్ జనాలు ఎక్కువగా వ్యక్తి ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నాయి. నాయకులు పటిష్టంగా ఉంటే పార్టీలతో ఇక్కడి వారికి సంబంధం ఉండదు. నాయకుడికే జై కొడతారు. గతంలో ఇదే పరిణామాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి.2014లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమా మహేశ్వరరావు విజయం సాధించారు. ఆయన మాస్ నేతగా గుర్తింపు సాధించారు. ఇక, ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న వంగవీటి రాధా వైసీపీ తరఫున జెండా మోసారు.నియోజకవర్గంలో ఆయన పట్టు సాధించారు. తన తండ్రి రంగా వర్గాన్ని కూడా చేరదీసి నియోజకవర్గంలో పుంజుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయనకు కాకుండా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు జగన్ సీటు కన్ఫర్మ్ చేయడంతో తాజాగా రాధా పార్టీకి గుడ్ బై చెప్పారు.ఈ పరిణామాలతో ఒక్కసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో మార్పు కనిపిస్తోంది.నిన్న మొన్నటి వరకు రాధాకు జైకొట్టిన ఇక్కడి మాస్ నాయకులు అందరూ ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. చివరకు వీరు మల్లాది వైపే మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. వాస్తవానికి ఇక్కడ రాధాకే టికెట్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ, తాజా పరిణామంతో కొందరు తటస్థ నేతలు ఎవరి వైపు మొగ్గు చూపాలా? అన్న సందిగ్దంలో ఉన్నారు.గత కొంతకాలంగా మల్లాది విష్ణు ఇక్కడ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆయనకు బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. రంగా వర్గానికి చెందిన కొందరు నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో రాధా తరఫున నిన్న మొన్నటి వరకు చక్రం తిప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు సామాజికవర్గం వైసీపీకి ఈ పరిణామాలతో పూర్తిగా దూరంఅయినా పెద్ద నష్టం లేదంటున్నారు. రాధాకు మద్దతుగా ఏకంగా ఐదుగురు కార్పొరేటర్లు సైతం పార్టీకి రాజీనామా చేశారు. అయినా కాపు ఓట్లను టీడీపీ,జనసేనలు చీల్చుకుంటే అది వైసీపీకి లాభమంటున్నారు. మిగిలిన సామాజిక వర్గాలు వైసీపీ అండగానిలబడతాయని, మల్లాది విష్ణు గెలుపు ఖాయమన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.