యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత కివీస్ కెప్టెన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి తొలి ఓవర్ నుంచే తడబడిన కివీస్ జట్టు 38 ఓవర్లలోనే 157 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విలియమ్సన్(64). రాస్ టేలర్(24) మినహా కివీస్ ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4, చాహల్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టగా కేదార్ జాదవ్ ఒక వికెట్ తీశాడు. తరువాత బ్యాటింగ్ కి వచ్చిన టీం ఇండియా 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది.