YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబై శాఖను మూసేసిన సీబీఐ!!

Highlights

  • ముంబై శాఖను మూసేసిన సీబీఐ
  • విపుల్ అంబానీ విచారిస్తున్న సీబీఐ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబై శాఖను మూసేసిన సీబీఐ!!

ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖకు రూ. 11,300 కోట్ల రూపాయల ఆర్థిక కుట్రకు  కారణంగా  సీబీఐ సీల్ వేసేసింది. సోమవారం ఇష్టారీతిన ఎల్‌వోయూలను జారీ చేసిన పీఎన్‌బీ ముంబై  శాఖను తాత్కాలికంగా మూసేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.అదే విధంగా  నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ వజ్రాల సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విపుల్ అంబానీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
రుణాల మంజూరులో రెండో అతిపెద్ద జాతీయ బ్యాంకైన పీఎన్‌బీకి ప్రఖ్యాత వజ్ర వ్యాపారి నీరవ్ మోదీ.. 11,300 కోట్లకు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంతో సంబంధమున్న ఇద్దరు పీఎన్‌బీ అధికారులతో పాటు పీఎన్‌బీకి చెందిన మరో ఐదుగురు అధికారులను విచారిస్తున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు సహా విచారణ ఎదుర్కొంటున్న పీఎన్‌బీ సిబ్బంది సంఖ్య 11కి చేరుకుంది. ఉన్నపళంగా పీఎన్‌బీ శాఖకు సీబీఐ అధికారులు తాళం వేయడంతో.. అందులో ఖాతాలు తెరిచిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితేంటని ఆందోళన చెందుతున్నారు. 

Related Posts