యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. కివీస్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ ధవన్ (75 నాటౌట్) అజేయ అర్ధశతకం సాధించాడు. కోహ్లీ (45) మరోసారి రాణించాడు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, బ్రాస్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.