యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అలిపిరి సమీపంలో బ్లాస్టింగ్ జరిగినట్లు, ఉగ్రవాదులను పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజాలు కావాని చిత్తూరు పోలీసులు స్పష్టం చేసారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. మంగళవారం నుంచి ఈ వీడియోలు వాట్సప్ తదితర ప్లాట్ ఫామ్లలో వైరల్ అయ్యాయి. ఈ మధ్య తెలంగాణా రాష్ట్రంలో వరంగల్ జిల్లా మాట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆక్టోపస్ సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ విజ్యువల్స్ ను అలిపిరి ఘటన గా ఎవరో పోస్ట్ చేసారు. భద్రకాళి టెంపుల్ దగ్గర ముస్కర్లు కార్ బ్లాస్ట్ చేసినట్లు, ఆక్టోపస్ సిబ్బంది ఇలాంటి దాడిలు జరిగినప్పుడు ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, అదేవిధంగా భద్రతను ఏ విధంగా కల్పించాలి, ముస్కర్లను ఎలా అదుపులోకి తీసుకోవాలి అనే దానిపై మాక్ డ్రిల్ ను నిర్వహించారు. దాంతో కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీనిని సోషల్ మీడియా లో వీడియోలను పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు అంతేగాని తిరుపతిలో గాని, తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గాని ఇలాంటి సంగటనగాని, మార్క్ డ్రిల్ గాని అలిపిరి సమీపంలో కూడా ఎక్కడ జరగలేదు. ఇటువంటి వదంతులను నమ్మకూడదని పోలీసులు ప్రకటనలో పేర్కోన్నారు.