యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ది పొందినవారు వాటిని ఇతరులకు కూడా అవగాహన అయ్యేలా భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చెప్పారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా అమలుచేయని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగున్నార సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేలాదికోట్ల రూపామలతో తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిందన్నారు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా చంద్రబాబు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, ఆర్ధిక లోటు ఉన్నప్పటికీ తన పరిపాలనా సమర్థతతో ప్రజలకు ఎటువంటి కష్టం జరుగకుండా పెద్ద ఎత్తున సంక్షేమ, అభివవృద్ది కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ క్రింద 10వేలు అందించడం, రైతు ఋణమాఫీ, చంద్రన్న భీమా, చంద్రన్న పెళ్లికానుక, వైద్య నవలు, తల్లీబిడ్డ ఎక్స్ ప్రస్ తదితర ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అంతేకాకుండా అధికారంలోకి రాగానే వివిధ పెన్షన్లను 5 రెట్లు పెంచడమేకాకుండా, ఎన్ టిఆర్ భరోసా క్రింద ప్రస్తుతం అందిస్తున్న వేయి రూపాయల పెన్షన్ ను 2 వేలకు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా లబ్దిపొందినవారు ఆ ప్రయోజనాలను ఇతరులకు కూడా తెలియజేసి చంద్రబాబు మళ్లీ సిఎం అయ్యేలా పూర్తిసహకారం అందించాలన్నారు. పేదలకు అన్ని విధాలా సహకరించే ప్రభుత్వం ఏదైనాఉందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమాంలో దెందులూరు ఎఎంసి ఛైర్మన్ మాగంటి సురేంద్రనాద్ చౌదరి, సిఆర్ ఆర్ కళాశాల కరస్పాండెంట్ రాంప్రసాద్, మజీ జడ్ పి టిసి గుత్తా కాశీబాబు, దెందులూరు నియోజక వర్గం నేతలు తదితరులు పాల్గొన్నారు.