YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆహ్వానించదగ్గ పరిణామం:

Highlights

  • ఈవారం
  • శివరాత్రి, పార్లమెంటు
  •  బడ్జెట్ ప్రభావం,
  • పంజాబ్ బ్యాంకు రూ.17,600 కోట్ల నీరవ్‌ మోదీ కుంభకోణం,
  • 'ప్రేమికులరోజు' లాంటి వార్తలతో అన్ని దినపత్రికలు కలర్ ఫుల్ గా ఉన్నాయి.
ఆహ్వానించదగ్గ పరిణామం:

ఆహ్వానించదగ్గ పరిణామం:
ఇక వాట్సాప్ తో సహా ఇతర సామాజిక మాథ్యమాలలో అవాకులు, చెవాకులు పేలే అవకాశం లేకుండా చట్టం రావడం అభినందించదగ్గ విషయం.

1) పత్రికలకు అందని వార్తలు:
సిద్దిపేట పట్టణంలో
అతి తక్కువ బరువుతో జన్మించిన మగ శిశువుకు పట్టణంలోని మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి (ఎంసీహెచ్‌)లోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మెదక్‌కు చెందిన స్వాతికి ఈ నెల 6వ తేదీన అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు జరుగగా కిలో బరువుతో మగ శిశువు జన్మించాడు. వైద్యులు రామస్వామి, వింధ్య నేతృత్వంలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు.

2) నకిలీ డాక్యుమెంట్లతో కోర్టునే తప్పుదోవ పట్టించిన గ్యాంగ్
విజయవాడ నగరంలో నకిలీ డాక్యుమెంట్లతో కోర్టునే ఓ గ్యాంగ్ తప్పుదోవ పట్టించింది. రూ. 10 కోట్లు విలువైన స్థలాన్ని కోటికే అమ్మేందుకు పథకం పన్నారు.

3) ఎట్టకేలకు హైకోర్టు అంతర్జాలం సమస్య కొలిక్కి వచ్చింది.

ఆందోళన చెందాల్సిన అంశం:
తెలుగు రాష్ట్రాల్లో పైశాచికంగా జరుగుతున్న హత్యోదంతాలు, క్రైం రేటు చూసి ఆందోళన చెందాల్సిన విషయం.

తరుముకొస్తున్న వైరస్ లు:
గతంలో అంతర్జాలం ప్రారంభించగానే ఇ-మెయిల్ ద్వారా వైరస్ వ్యాప్తి చెంది. కంప్యూటర్ డాటాను అస్తవ్యస్తం చేసేది.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో ఫీచర్స్ కారణంగా ఒక మొబైల్ నుంచి మరో మొబైల్ కి ఊహించనంత వేగంగా వైరస్ వస్తోంది.
దీనికి విరుగుడిగా "ఎం సెట్" బ్రౌజర్ ఉచిత సేవలఃదిస్తూ మార్కెట్ లోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లలో
'ఈనాడు', 'సాక్షి' "ప్రత్యేకహోదా" వార్తలు ఎవరి కోణం వారిదే రీతిలో ఇచ్చాయి. మన, నవ‌, నా తెలంగాణ మనం, వార్త, మనం పత్రికలు రైతు సమస్యల పై కథనాలు ఎక్కుపెట్టాయి.
కె.సి.ఆర్. పుట్టినరోజు వేడుకల ప్రకటనలు 'నమస్తే తెలంగాణ' కన్న 'ఆంధ్రజ్యోతి'కి ఎక్కవగా రావడం జరిగింది.

కన్నేశారు... ఇక కలకలమే:
సంచలనాలకు నెలవైన "న్యూస్ పేజీ" 100 మంది అవినీతిపరుల జాబితా ఈ వారం ప్రారంభమయ్యే అవకాశం.

"పొలిటికల్ వార్" సంచలన కథనాలతో ముస్తాబు అవుతోంది.

'న్యాయస్థానం'లో జరిగే క్లరికల్ తప్పుల ప్రస్థావనలపై "నమస్తే తెలంగాణ" కొండపల్లి కన్నేశారు.

రేణుక నవ్వు - ప్రియా అభినయం
పార్లమెంటులో నరేంద్రమోదీ మాట్లాడుతుండగా  రేణుకాచౌదరి నవ్వుడంపై  ఉత్తరాదిన సంచలనం కలిగించాయి. అయితే
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఒక అడుగు ముందుకేసి రేణుకను కించపరిచేలా 'శూర్పణఖ'గా వర్ణిస్తూ పోస్ట్ చేశారు. ఇది పెద్ద వివాదమే రేపింది. తర్వాత ఆయన ఆ పోస్టును తొలగించారు. అయినా రేణుక చౌదరి కేంద్రమంత్రిపై హక్కుల నోటీసు ఇచ్చారు.
మొత్తం మీద 'రేణుక నవ్వు' జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత రేణుక చౌదరి విమర్శల దాడి పెంచారు. దేశ, విదేశీ మీడియా ఈ సంఘటనకు మంచి ప్రాచుర్యం ఇవ్వగా... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా  కవరేజి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితరప్రాంతాల్లో రేణుకాచౌదరి ప్లెక్సీలతో ఆందోళనలు, అరెస్టులు జరిగాయి. అయితే స్థానిక కాంగ్రెస్ కమిటీలు మౌనవ్రతం పాటించడం గమనార్హం.

మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్‌ లవ్‌’లోని ‘మాణిక్య మలరాయ పోవు’ పాటలో ఆ చిత్ర కథానాయిక 'ప్రియా వారియర్‌' చేసిన అభినయం యువతను కట్టి పడేసింది.

మన "జ్ఞా"నం అంటే మజాకానా:
ప్రపంచవ్యాప్తంగా 'జ్ఞా' తెలుగు అక్షరం ఐఫోన్ వినియోగదారులను ఇక్కట్లకు గురి చేస్తున్నది. ఈ లెటర్ టైప్ చేయగానే ఐ ఫోన్ స్టక్ అవుతోంది.

ఆకర్శించిన శీర్శికలు:
1) పాఠశాలల్లో గ్రంథాలయాల నిర్వహణపై....
చూసుకుని మురవడం.. చెప్పుకుని సంతోషించడం

2) వ్యవ‘సాయం’లోనూ నిర్లక్ష్యం!

3) మాటల బురిడి.. కాసులు దండి
సైన్యంలో ఉద్యోగాల పేరిట వసూళ్లు 

4) రూ.కోట్ల వృథాకు...కొత్త వ్యూహం..!
దుర్గమ్మ సన్నిధిలో ఆగని కొట్టడం.. కట్టడం 
వాస్తుదోషం పేరిట ఈవో కార్యాలయం మార్చేందుకు ప్రణాళికలు

5) సూదీ లేదు... దారమూ లేదు!

6) తూర్పున ఉదయించి.. పశ్చిమాన అస్తమించి..
తెదేపా నేత, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య కన్నుమూతతో జిల్లాలో విషాదం 

6) చచ్చాక... నీళ్లు పోస్తున్నారు..!
జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ప్రత్యేకత

7) తక్కువ ధరకు తన్నుకుపోతారు..
‘ప్రైవేటు’ గాలం సేకరణ బాధ్యత నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌కు అప్పగించిన  ప్రభుత్వం 

8) ఏడి'పింఛను',,...

9) రిజిస్ట్రేషన్ ఆఫీసు అవినీతిపై 'పైసలిస్తేనే ఫైలు కదిలేది"

10) నేతలు నేర్వరు..‘రాతలు’ మారవు
స్పందించని ప్రజాప్రతినిధులు 

11) తరాజుతో రివాజుగా మారిన మోసం

12) రోజులు తరుముకొస్తున్నాయ్‌.. పనులు వెక్కిరిస్తున్నాయ్‌
ఇబ్బడి ముబ్బడిగా టెండర్లు.. జరగని పనులు 
40 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం 

13) తల్లి పీతకు.. కష్టం
గుడ్డుతో ఉన్నవాటి వేట వాటిని వదిలితే పరిశ్రమ వృద్ధి 

14) 'గుండె’లు తీసిన బంట్లు సాక్షి కథనం హైలైట్

కొసమెరుపు:
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఐ.పి.ఎస్. ల మీద అభియోగాల నమోదు కార్యక్రమం పూర్తయింది.
ఈనెల 24న ఒకరి విషయం, మార్చి చివరకు మరొకరి భవితవ్యం తేలిపోతుంది. ఈ ప్రక్రియ దేశ పోలీసు చరిత్రలో మార్పుకు శ్రీకారం చుట్టడం ఖాయం. ఐదేళ్లపాటు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని  పోరాటం చేసిన ఆ ఇద్దరు సామాన్యులకు మాత్రం 

(విశ్లేషణ: అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009,)

Related Posts