యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అందమైన పర్యావరణాన్ని దోచేసి ద్వంసం చేస్తుంటే మాట్లాడేవారు లేరు. దాన్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి గాని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం నాడు అయన పాడేరు లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. యువత ఎందుకు గంజాయి సాగు కి వెళ్తున్నారంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టరు, ట్రైబల్ యూనివర్సిటీస్ పెట్టరు. టూరిజం అభివృద్ధి చెయ్యరు, ఉద్యోగాలు కల్పించరు, కనీసం స్కూల్స్ లో మరుగుదొడ్లు ఉండవు. పదవులే కావాలనుకుంటే పార్టీ పెట్టక్కరట్లేదు. డ బ్బులే కావాలనుకుంటే దానికి పార్టీ అవసరం లేదని అయన అన్నారు. మీ అందరికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ని ఇవ్వడానికే జనసేన పార్టీ ఉంది. అందమైన పర్యావరణాన్ని దోచేసి ద్వంసం చేస్తుంటే మాట్లాడేవారు లేరు. దాన్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి గాని లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి అని ఏ ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి లేదు నేను ఈరోజున ప్రజల్ని మభ్య పెట్టి పేరు గని డబ్బుగాని సంపాదించాల్సిన అవసరం లేదు. తప్పుకోలేని సమస్యలు ఎన్నో అడుగడుగునా ఉన్నాయి. నాదగ్గర వేల కోట్లు లేవు। కానీ మీకేదైన చేయాలనే ఆశయం బలంగా ఉంది. జనసేన పార్టీ కోరుకునేది యువత నుంచి బలమైన నాయకత్వం. మేము యువనాయకులని తీసుకొచ్చి తీరతాం రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు దోపిడీ వ్యవస్థలో భాగస్వామ్యం వహిస్తే ఎం చేస్తాం? కంచే చేను మేస్తే ఎం చేస్తామని అయన ప్రశ్నించారు.