యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కుంభకోణాలే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు. జగన్ నేరాలను కాపీకొట్టడం ఎవరి తరమూ కాదు. హార్వర్డ్ యూనివర్సిటిలో జగన్ అవినీతి ఒక సబ్జెక్టు. నవ రత్నాలు కాదు జగన్ వి అష్టావక్ర దోపిడీలు. ఎమ్మార్ కుంభకోణం జగన్ ఒక రత్నమని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బుధవారం అయన ఒక ప్రకటన విడుదల చేసారు. టైటానియం కుంభకోణం ఇంకో రత్నం. వోక్స్ వ్యాగన్ కుంభకోణం మరో రత్నం. మద్యం కుంభకోణం ఇంకోరత్నం. ముగ్గురాయి కుంభకోణం ఒక రత్నమైతే, బాక్సైట్ కుంభకోణం ఇంకో రత్నం. ఇనుప ఖనిజం కుంభకోణం జగన్ మరో రత్నం. వాన్ పిక్ కుంభకోణం ఇంకో రత్నం. లేపాక్షి కుంభకోణం జగన్ మరో రత్నం. జలయజ్ఞం ధన యజ్ఞం ఇంకో కుంభకోణమని విమర్శించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్ కుంభకోణాలకు అంతేలేదు. రూ.లక్ష కోట్లు, 13ఛార్జి షీట్లు, 16నెలల జైలు...ఇవి తప్ప జగన్ సాధించింది ఏముంది..? పించన్ 10రెట్లు చేసిన పార్టీ తెలుగుదేశం ఒక్కటే. రూ.200నుంచి రూ.2వేలకు పెంచిన ఘనత టిడిపిదేనని అన్నారు. 3ఎకరాల రైతుకున్న రాబడి ప్రతి పించన్ దారుడికి. ఆత్మగౌరవం పెంచాం పించన్ దారులకు. నెలకు రూ.2వేలు పించన్ గొప్ప భరోసా. పించన్ల పెంపును అందరూ స్వాగతించాలి. పేదలకు పించన్ల పెంపును వైకాపా నిందిస్తోంది. కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తే నిందిస్తోంది. ఆటో డ్రైవర్లకు పన్ను తొలగిస్తే నిందిస్తున్నారు. ట్రాక్టర్లపై పన్ను తొలగిస్తే విమర్శిస్తున్నారు. మంచి చేయడాన్ని వ్యతిరేకించే ఏకైక పార్టీ వైసిపి. సమాజానికి చెడు జరగాలని కోరే పార్టీ వైకాపా. పేదల సంక్షేమం పార్టీ తెలుగుదేశం. ప్రజాధనం దోపిడి పార్టీ వైకాపా అని ఆరోపించారు. నిర్మాణానికి టిడిపి నిదర్శనం. విధ్వంసానికి నిదర్శనం వైకాపా.అందుకే అన్నివర్గాల ప్రజలు టిడిపి వెన్నంటే వుంటారని అయన అన్నారు.