102 పేరుతో వాహన సేవలు
తక్షణ సేవలకోసం టువీలర్ 108 అంబులెన్సు.. సీఎం కేసీఆర్
నగరంలోని పీపుల్స్ ప్లాజాలో 102 సర్వీస్ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గర్భిణిల ప్రసవ సమయంలో ఆస్పత్రులకు, ప్రసవం తర్వాత ఇంటికి చేర్చేందుకు 102 వాహనాలను ఉపయోగించవచ్చన్నారు. అలాగే అత్యవసర సమయంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు యాభై 108 బైక్ అంబులెన్స్‌లు ప్రారంభించామన్నారు. కాగా... రెండు వందల 102 సర్వీస్ వాహనాల్లో జీపీఎస్ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.
సర్కారు వైద్యాన్ని పేదలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు అమ్మఒడి పేరిట 102 వాహనాలను అందుబాటులోకి తెస్తున్నది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులను ప్రసవానికి ముందు దవాఖానకు చేర్చడం, తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబ సభ్యులను కూడా సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి వాహనాలను ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని మురికివాడల్లో అత్యవసర వైద్య సేవలందించేందుకు ప్రయోగాత్మకంగా ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్స్‌పేరిట 108 టువీలర్ అంబులెన్సులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న 102 అమ్మఒడి వాహనాలను, 108 టువీలర్ అంబులెన్సులను బుధవారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో 102 సర్వీస్ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారులో ప్రారంభించనున్నారు.
41 అమ్మఒడి వాహనాలు
గర్భిణులకు ఉచిత సేవలు అందించే ఉద్దేశంతో 41 అమ్మఒడి వాహనాలను (రిఫెరల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్) రాష్ట్రంలో అందుబాటులోకి తెస్తున్నారు. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వాహనాలను 200 వరకు పెంచేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ సహకారంతో అమ్మఒడి వాహన సేవలను అందించనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గిరిజన ఆవాస ప్రాంతాల్లో 102 సేవలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా 50 టువీలర్ 108 వాహనాలను సిద్ధం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గర్భిణిల ప్రసవ సమయంలో ఆస్పత్రులకు, ప్రసవం తర్వాత ఇంటికి చేర్చేందుకు 102 వాహనాలను ఉపయోగించవచ్చనున్నారని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తెలిపారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...అలాగే అత్యవసర సమయంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు యాభై 108 బైక్ అంబులెన్స్‌లు ప్రారంభించామన్నారు. కాగా... రెండు వందల 102 సర్వీస్ వాహనాల్లో జీపీఎస్ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.