YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

న్యూజిలాండ్ లో ప్రకంపనలు

న్యూజిలాండ్ లో ప్రకంపనలు
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
న్యూజిలాండ్‌లో బుధవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వాంగనై తూర్పు ప్రాంతంలో మంగళవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్ ఉత్తర ద్వీపంలోని గిస్‌బోర్న్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో ఓ మోస్తరు భూకంపం సంభవించింది. ఎల్ఎస్పెరెన్స్ రాక్‌కు ఆగ్నేయంలో 250 కిలోమీటర్ల దూరంలో 10 కి.మీ భూమి లోపల భూకంప కేంద్రం ఉందని అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. పసిఫిక్ తీరంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటాలు స్థానికులను భయబ్రాంతులకు లోనుచేస్తుంటాయి. రెండు రోజులుగా వరుస భూకంపాలు సంభవిస్తున్నా.. సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం నేడు నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఘన విజయం సాధించింది

Related Posts