యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పడింది. ఈ క్రమంలో నందమూరి సుహాసిని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సంక్రాంతి సందర్బంగా తెనాలి వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సుహాసిని మీడియాతో మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు ఆదేశిస్తే ఏపీలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్న సుహాసిని,రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయానికి తమ కుటుంబం శక్తి వంచన లేకుండా సహకరిస్తుందని స్పష్టం చేశారు.అయితే సుహాసిని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లోకి సుహాసిని ఎంట్రీ ఉంటుందా.. లేదా అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. కాగా, తెలంగాణ ఎన్నికల సమయంలో అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుహాసిని, కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుహాసిని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఏపీలో.ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉన్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఎన్నికల నేపధ్యంలో ఏపీ పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఏపీ రాజకీయాల్లో తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. బుధవారం ఏపీ ప్‌డతిపక్ష నేత,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఏపీలో అడుగుపెడతామని, చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానంటూ గతంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు కేటీఆర్, జగన్ భేటీ రాజకీయంగా సంచలనంగా మారింది. మొదటిసారి కేటీఆర్,జగన్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.