యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
అష్టాక్షరీ మంత్రంలోని ‘రా’; పంచాక్షరిలోని ‘మా’ కలిసి ‘రామ అనే నామం అయింది.
రా – అగ్నిబీజం – ఈ అక్షరం పాపరాశిని దగ్ధం చేస్తుంది.
మ – అమృత బీజం – ఈ అక్షరం పాపరాశికి ప్రవేశం లేకుండా చేస్తుంది.
రామ అనే శబ్దాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా ఎటువంటి పలుకుల్లో భాగంగా పలికినా అవి జీడిపప్పు పలుకులై ముక్తి సుగంధాన్ని మనకి అందిస్తాయట. ఒకానొక అరణ్యంలో వేటాడుతున్న కిరాతకులను ఎవరు ప్రశ్నించినా వారు వారి దినచర్యను ఈవిధంగా వివరిస్తున్నారట.
వనేచ’రామః’ వసుచాహ’రామః’ నదీస్త’రామః’ నభయం స్మ’రామః’
ఇతీరయంతొ కిరాతాః ముక్తిం గతా రామ పదానుషంగాః!!
మేము అడవుల్లో తిరుగుతూ ఉంటాం, జంతువులను వేటాడుతూ ఉంటాం, నదులను సులువుగా దాటేస్తూ ఉంటాం, భయం మా మనస్సులోకి రాదు అంటూ ఉంటె అనుకోకుండా ఆ మాటల్లో రామః రామః అని పలుమార్లు రావడం వల్ల రామ సంకీర్తన చేసిన ఫలం లభించి వారు మోక్షం పొందగలిగారట