YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫిబ్రవరి 13న అమరావతిలో సభ

ఫిబ్రవరి 13న అమరావతిలో సభ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్ర‌ధాని మోదీ వ్య‌తిరేక ప‌క్షాల స‌భ అమ‌రావ‌తిలో నిర్వ‌హ‌ణకు ముహూర్తం ఖ‌రారైంది. ఫిబ్ర‌వ‌రి 13న అమ‌రావ‌తి స‌భ నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యించిన బాబు ఆహ్వానాలు పంపుతున్నారు. క‌ల‌క‌త్తాలో తృణ‌మూల్ అధినేత్రి ..ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నిర్వ‌హించిన స‌భ‌కు ధీటుగా అమ‌రావ‌తిలో భారీ స‌భ ను నిర్వ‌హించాల‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇందు కోసం అమ‌రావ‌తి స‌భ‌ను ఫిబ్ర‌వ‌రి 13న ముహూర్తంగా ఖ‌రారు చేసారు. ఇందులో భగంగా, చంద్రబాబు నాయుడు  రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై లోక్‌సభ ఎన్నికలకు మహాకూటమిని సిద్ధం చేయటం గురించి చర్చించారు. కోల్‌కత్తాలాంటి ర్యాలీని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిర్వహించటం గురించి వారు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.తెలుగుదేశం పార్టీ ఫిబ్రవరి 13న అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ధర్మపోరాట సమావేశానికి రాహుల్ గాంధీని చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రాహుల్ అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన అనంతరం విమానాశ్రయం నుండే దావోస్‌లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఆ తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను కలిసి ఫిబ్రవరి ఒకటో తేదీన ఏపీ హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావల్సిందిగా ఆహ్వానించారు. న్యాయమూర్తులు సుభాషిణీ రెడ్డి, రావు నాగేశ్వరరావు తదితరులను కలిసి హైకోర్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాలను అందజేశారు. తదనంతరం రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి మహాకూటమిపై చర్చించారు.ఆంధ్రప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో మహాకూటమి ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయటం, మహాకూటమి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయటం, ఎన్నికల ప్రచార సరళి తదితర అంశాలపై ఆయన రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత వారం కోల్‌కత్తాలో నిర్వహించిన భారీర్యాలీ, ఆ తరువాత ప్రతిపక్ష నాయకులు జరిపిన చర్చల వివరాలను ఆయన రాహుల్ గాంధీకి వివరించారని అంటున్నారు. రాహుల్ నాయకత్వాన్ని మమత వ్యతిరేకించటం తెలిసిందే. ప్రధాన మంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించకుండా ఎన్నికల అనంతరం ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావచ్చునని మమతా బెనర్జీ చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు, రాహుల్ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నాయకులు ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలను వివాదాస్పదం చేయటం తదితర అంశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. కోల్‌కత్తా లాంటి ర్యాలీలను ఇతర రాష్ట్రాల్లో నిర్వహించటం ద్వారా మహాకూటమిని పటిష్టం చేయాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు.

Related Posts