Highlights
- టీ20 మ్యాచుల్లో 134 క్యాచులు.
- టీ20లో ధోనీ ప్రపంచ రికార్డు..
దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో అందరి దృష్టి శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌పైనే ఉంది. ధావన్ 70 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్, భువీ 5 వికెట్ల వేట.. ధోనీ సాధించిన ఫీట్‌ను మరుగున పడేశాయి. ఇంతకీ, ధోనీ సాధించిన ఆ ఫీటేంటి.. ఆ ప్రపంచ రికార్డేంటి..? అంటే.. అత్యధిక అవుట్‌లు చేసిన వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హెండ్రిక్స్ క్యాచ్ ద్వారా 134 క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించారు. తద్వారా 254 టీ20 మ్యాచుల్లో 133 క్యాచులు పట్టిన శ్రీలంక వికెట్ కీపర్ కుమార్ సంగక్కరను అధిగమించాడు. ఇక, అంతర్జాతీయ టీ20 మ్యాచులను పరిగణనలోకి తీసుకుంటే.. 87 మ్యాచులలో 48 క్యాచులు, 29 స్టంపింగుల (77)తోనూ ధోనీ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.