YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మమతపై ముప్పేట దాడిలో కమలం...

మమతపై ముప్పేట దాడిలో కమలం...
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి థర్డ్ ఫ్రంట్ హడావిడి కి బ్రేక్ వేసే వ్యూహానికి కమలం పదును పెడుతుందా ? సొంత రాష్ట్రం దాటి బయటకు రాలేని పరిస్థితి మమత కు కల్పించే ప్లాన్ కు మోడీ, షా ద్వయం రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ కార్యాచరణ చెప్పక చెబుతుంది. కోల్ కత్తాలో విపక్షాల భారీ ర్యాలీ తరువాత మమత దూకుడుకు ఇప్పుడే బ్రేక్ వేయాలని గట్టిగా దృష్టిపెట్టింది బిజెపి అధిష్టానం. తద్వారా ఆమె ప్రధాని పదవిపై పెట్టుకున్న ఆశలను గల్లంతు చేసే పని మొదలైపోయింది అంటున్నారు విశ్లేషకులు. మమత ఫార్ములానే అనుసరించి ఆమె ప్రయత్నాలను వమ్ము చేయాలన్నదే కమలం వ్యూహంగా తేలిపోతుంది.తమ రథయాత్రకు అడ్డు తగిలి బిజెపి సర్కార్ పై పంజా ను భారీ ర్యాలీతో ఛాలెంజ్ చేశారు మమత. సరిగ్గా ఈ తరహాలోనే స్కూల్ స్టార్ట్ చేసారు కమలదళపతి అమిత్ షా. ఆయన ర్యాలీ కూడా విజయవంతం కావడంతో ఇక వరుసగా అగ్రనేతలతో బెంగాల్ మొత్తం చుట్టేయాలని షా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి రాజనాధ్, గడ్కరీ వంటి వారంతా వచ్చే రోజుల్లో బెంగాల్ లక్ష్యంగా ర్యాలీల్లో పాల్గొననున్నారు.ముప్పేట దాడితో బిజెపి బెంగాల్ ను తమ ప్రచారంతో హోరెత్తించనుంది. అదే జరిగితే మమత తన సొంత ఇలాఖా లో తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు జాతీయ రాజకీయాల సంగతి ఎలా వున్నా లోకల్ కే పరిమితం కాక తప్పని పరిస్థితి ఉంటుందని లెక్కేస్తున్నారు. దాంతో ఇతర రాష్ట్రాల్లో మమత పర్యటించే సమయం తగ్గుతుందని భావిస్తున్నారు. మరి ఈ వ్యూహాన్ని మమత ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Related Posts