యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైకాపాకి రాజీనామా చేయడానికి కారణాలు కొంత మందికి చెప్పాం. కొంతమందికి చెప్పలేదు. జగన్ తన సొంత తమ్ముడని అన్నారరు. కాని నాకు అవమానాలు అడుగు అడుగునా చేశారు. వైకాపా లో ఎన్నో అవమానాలు దిగమింగుకుని ఉన్నానని వంగవీటి రాధా అన్నారు. తాను పార్టీ మారుతున్న నేపధ్యంలో అయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో అవమానాలు ఇంకా ఎవరికీ జరగకుండా ఉండటానికి పార్టీ మారుతున్నా. నా తండ్రి విగ్రహ ఆవిష్కరణకు జగన్ కు చెప్పి తీసుకోవాలా..! ఎవరీ పర్మిషన్ అవసరం లేదు నాకని అన్నారు. అభిమానులు బోజనం తీసుకువస్తే తప్పుఅయిపోయిందా జగన్ మోహన్ రెడ్డికి. ఎవ్వరికీ చెప్పాలని వెళ్ళావు ఇది నా పార్టీనని అనడం జగన్ మోహన్ దుశ్చర్య అని మండిపడ్డారు. నా తండ్రి చనిపోయి 30 ఏళ్లు గడిచినా ఆయన దేవుడిగా నేను భావిస్తా. నేను మాట్లాడే ప్రతి మాట నాకు తెలుసు నేను నిజమే మాటలాడుతున్నా. రంగ గారిని గౌరవించాలని జగన్ కి తెలియదా అని అయన ప్రశ్నించారు. నా తండ్రి ఆశయ సాధనకోసం అభిమానుల కోసం విగ్రహ ఆవిష్కరణ కోసం నేను వెళ్ళాను. జగన్ మీద హత్యాయత్నం జరిగితే ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేక తెలంగాణ పోలీసులను ఎలా నమ్మారు. నా మీద సోషల్ మీడియా లో వదంతులు వస్తే ఐపి అడ్రెస్ లు చేజ్ చేసి పట్టుకోవొచ్చుగా అని అన్నారు. ఏమి చేయాలని నేను జగన్ పార్టీలో ఉండాలి. ఎమ్మెల్యే అనే వాడిని చీపురుపుల్ల లాగా తీసిపారేస్తే ఇంక దేనికి నేనని అవేదన వ్యక్తం చేసారు. జగన్ నా మీద జాలి చూపించా అంటున్నారు. నా తండ్రికి గౌరవం ఇవ్వరా. వరుసకు నా తమ్ముడనవే నీవు ఇంత జరుగుతున్నా కనీసం ఫోన్ చేసావా అని నిలదీసారు. సీటు ఇవ్వనందుకు బాధపడలేదు. సూటి పోటి మాటలు అని రంగా గారిని అవమానిస్తున్నారని అయన విమర్శించారు.
వంద కోట్లు డబ్బులు తీసుకొని పార్టీలో చేరుతారని ఆరోపణలు అవాస్తవం. నా ఊపిరి ఉన్నంతవరకు మా నాన్న పేరు చెడ్డగొట్టనని అయన అన్నారు. రంగా హత్య ఉదంతం మీద వ్యాఖ్యానిస్తూ కొంత మంది వ్యక్తులు చేసింది పార్టీకి సంబంధం లేదని అన్నారు. నాకు చాలా బాధఅనిపించింది కొంత మంది వ్యక్తులు చేసింది పార్టీని పూయడం సమంజసం కాదని అన్నారు. రంగాని అభిమానించేవాళ్లు అన్ని పార్టీలో ఉన్నారు. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు. రంగా గారిది ఒక వ్యవస్థ అని 10మందికి ఉపయోగపడాలని చంద్రబాబు పిలవడం జరిగిందని అన్నారు. నా వాళ్ళను నేను కాపాడుకోవాల్సిన బాద్యత నాది నా తండ్రి ఆశయాలే నాకు ముఖ్యం. పదవి కోసం పార్టీలోనికి రాలేదు నా తండ్రి ఆశయసాధనాలే ముఖ్యమని అన్నారు. నేను పోయేవరకు ఒకటే చెబుతున్నా నా తండ్రి ఆశయసాధనాలే నాకు ముఖ్యమని అయన స్పష్టం చేసారు.