Highlights
- మార్చి 23 నుంచి సెట్స్ పైకి
- లోకేషన్లను ఎంపిక పనిలో వినోద్
జూనియర్ ఎన్టీఆర్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం విదితమే. మార్చి 23 నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ కుటుంబకథా చిత్రం.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సంగీత దర్శకుడిగా తమన్‌ను ఎంపిక చేసిన చిత్ర బృందం. తాజాగా సినిమాటోగ్రాఫర్‌గా పి.ఎస్.వినోద్‌ను సెలెక్ట్ చేసింది. గతంలో ‘మనం’, ‘ఊపిరి’, ‘ధృవ’, ‘హలో’ చిత్రాలకు తన వైవిధ్యమైన పనితనాన్ని చూపిన ఈ ఛాయాగ్రాహకుడు.. తొలిసారిగా ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో పనిచేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం లొకేషన్లను ఎంపిక చేసే పనిలో వినోద్ ఉన్నట్టు సమాచారం. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తారు.