యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హైదరాబాద్–వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా మరియు తయారీ రంగంలో తనకంటూ స్తానం సంపాదించుకున్న ప్రిజమ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటేడ్, సింగపూర్ లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ 2018 మూడవ ఎడిషన్ వద్ద మాన్యుఫాక్చరింగ్–అగ్రి ఇన్ పుట్స్ విభాగంలో ఆసియాన్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ లీడర్స్ 2018 అవార్డును అందుకుంది.ఈ సందర్బంగా నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుజ్జ యుగంధర్ రావు కో డైరెక్టర్స్ సిఎచ్ సాంబశివ రావు,డాక్టర్ రాజశేకర్ జనరల్ మేనేజర్ సుదర్శన్ రెడ్డి లతో కలిసి మాట్లాదారు. ఆర్గానిక్ ఉత్పత్తులు, మొక్కలు వృద్ధి చేందేందుకు తోడ్పడే పోషకాలు, సముద్రపు పాచి సారం , ప్రొటీన్ హైడ్రోలిజేట్ మిక్చర్స్ మరియు రసాయన ఎరువుల ఫార్ములేషన్స్ ను రైతు సమాజానికి ఫోలియర్ మరియు సాయిల్ అప్లికేషన్ కోసం తమ సంస్థ అందిస్తుందని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలను అందించడం కోసం మేము చైనా కేంద్రంగా కలిగిన వ్యవసాయ ఉత్పత్తుల గ్రూప్ – షాంఘాయ్ సెల ఆగ్రో మరియు యుకె కేంద్రంగా కలిగిన 9 మసాక్ లిమిటెడ్ తో భాగస్వామ్యం చేసుకుని మైక్రో బైల్ మెటబాలిటిస్ మరియు ప్రొటీన్ లాక్ట్ గ్లూసోనేట్స్ లో వారి సాంకేతిక నైపుణ్యంతో 100 శాతం ఆర్గానిక్ ఉత్పత్తులను న్యూట్రిషన్, పెస్ట్ మేనేజ్ మెంట్ లో మేము తయారు చేస్తున్నాం అని చెప్పారు. దాదాపుగా భారతదేశంలో అన్ని ముఖ్యమైన నగరాలలోనూ మేము ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీ2భీ వ్యాపారాల ద్వారా మా ఉనికిని చాటుతున్నామన్నారు. మా ఛానెల్ భాగస్వాముల నెట్ వర్క్ తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ , కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్, ఒడిషా, పశ్చిమబెంగాల్, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్ లో ఉన్నారన్నారు. ప్రిజమ్ క్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ ను 2008 న సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని,తెలంగాణాలోని హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం ఉన్నట్లు తెలిపారు. ప్రీమియం క్యాలిటీ అగ్రి ఇన్ పుట్స్ ను తయారు చేయడంతో పాటుగా సరఫరా చేయడం ద్వారా పరిశ్రమలో గుర్తింపునొందిన సంస్థలలో ఒకటిగా నిలిచిందని చెప్పారు. దేశవ్యాప్తంగా మా వినియోగదారుల నడుమ ప్రశంసలను అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను సరసమైన ధరలలో నిర్ధేశిత సమయంలో అందించడం ద్వారా పొందామన్నారు.మావిస్తృత శ్రేణి ఉత్పత్తులలో చెలాటడ్ మైక్రో న్యూట్రియంట్స్ మరియు ఫోలియర్ స్ర్పే మరియు సాయిల్ అప్లికేషన్ కోసం వారి మిక్చర్స్ , బయలాజికల్ పెస్టిసైనడ్స్, యాంటాగోనిస్టిక్ ఫంగీ, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ , బయో రేషనల్ ప్రోటెక్టంట్స్ , ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్, సీవుడ్ ఎక్స్ ట్రాక్ట్ , అమినో యూసిడ్ గ్రాన్యూల్స్ ఉన్నాయన్నారు. ప్రిజమ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిడెట్ మేనేజింగ్ డైరెక్టర్ , గుజ్జా యుగంధర్ రావును 21 జనవరి 2019 వ తేదీన సత్కరించారు. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (ఈ విధాన సమీక్షకులు ) దీని బ్రాండ్లను అత్యంత జాగ్రత్తగా పరిశీలించిన మీదట ఆ అవార్డును అందుకోవాడానికి ప్రిజమ్ క్రాప్ సైన్స్ ప్రేవేట్ లిమిటెడ్ ను ఎంపిక చేసింది.
సింగపూర్ లో జరిగిన భారీ బ్రాండ్ ఫెస్టివల్ సదస్సు ఆసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్ 2018 . ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, వ్యాపార అగ్రగాములు, ప్యానలిస్ట్ లు, ఆసియా మరియు ఆఫ్రికా నుంచి న్యాయనిర్టేతులు మరియు సభ్యులు దీనిలో పాల్గొన్నారు.