YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం కోటా

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం కోటా
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పది శాతం కోటాని ఫిబ్రవరి నుంచే అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సంబంధిత మంత్రిత్వ శాఖ చెప్పింది. ఫిబ్రవరి ఆ తర్వాత నుంచి నోటిఫై చేసిన అన్ని ఖాళీల్లో చేసే ఉద్యోగాల భర్తీకి ఈ ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తామని స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124 వ రాజ్యాంగ సవరణ బిల్లుకు జనవరి 9 న పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుల ఆధారిత 50 శాతం కోటాకు చెందని వాళ్లు, వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లు ఈ పది శాతం కోటా లబ్ధిని పొందుతారు. కుటుంబానికి ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి. నోటిఫైడ్ మున్సిపాలిటీల్లో వెయ్యి చదరపు అడుగుల లోపు ఇల్లు 1000 చదరపు గజాలలోపు ఇంటి స్థలం ఉండాలి. వీటన్నింటికీ కనీసం తహసిల్దార్ స్థాయికి తక్కువ కాని అధికారి ధృవీకరణ పత్రాలు ఉండాలన్న నిబంధన విధించారు.

Related Posts