YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రియాంకకు...అనుకున్నంత వీజీకాదు

ప్రియాంకకు...అనుకున్నంత వీజీకాదు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
క్రీయాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద టార్గెటే ఇచ్చారు. ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఇందిరా గాంధీని తలపించేలా వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్‌తో ఆమె హస్తం పార్టీని విజయాల బాటలో నడుపుతారని కాంగ్రెస్ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. రాహుల్ గాంధీ కూడా తన చెల్లెలిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. రాజకీయాల్లోకి తీసుకొస్తూనే ఆమెకు పెద్ద టార్గెట్ ఇచ్చారు. పెద్ద రాష్ట్రమైన యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలను ప్రియాంక గాంధీతో జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు. తూర్పు యూపీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకను నియమించిన రాహుల్.. పశ్చిమ యూపీ బాధ్యతలను సింధియాకు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాధ్ నాయకత్వంలోని బీజేపీని ఓడించి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేది ప్రియాంక, సింధియాలకు రాహుల్ ఇచ్చిన టార్గెట్. ఈ విషయంలో రాహుల్‌కు సన్నిహితుడైన సింధియా, ప్రియాంక ఏ మేరకు విజయవంతం అవుతారో చూడాలి. మోదీ, యోగిలను ఢీకొట్టడానికి ప్రియాంక చరిష్మా, వ్యూహాలు ఉపయోగపడతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్ నియోజకవర్గం అమేథీ, సోనియా ఎంపీగా గెలిచిన రాయ్ బరేలీ ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించిన తూర్పు యూపీలోనే ఉన్నాయి. ఇవే కాకుండా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి, యోగి ఆదిత్యనాధ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్ కూడా ప్రియాంక పరిధిలోకే వస్తాయి.వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ జతకట్టాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఈ రెండు పార్టీల పట్ల రాహుల్ సానుకూలంగా ఉన్నారు. అఖిలేష్, మాయవతి, ములాయం సింగ్ యాదవ్‌ల పట్ల తనకెంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ఓటమి తథ్యమన్న రాహుల్.. దీన్నెవరూ ఆపలేరన్నారు. 

Related Posts