YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

బీజేపీ వెన్నులో వణుకు..

Highlights

  • ఎన్డీఏ కూటమికి ఎన్‌పీఎఫ్‌ గుడ్‌ బై
  • నాగాలాండ్‌ ఎన్నికల తర్వాత
  • బీజేపీతో తెగతెంపులు నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌
బీజేపీ వెన్నులో వణుకు..

దేశంలో తిరుగులేదనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న  నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌) తన మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించుకోగా.. బీజేపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. మిత్రపక్షం నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌) ఎన్డీఏ కూటమికి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రజల సమక్షంలో ప్రకటిస్తాం’అని ఎన్‌పీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మురంగ్‌ ప్రకటించారు. 
మణిపూర్‌ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా.. బీజేపీకి 31 మంది ఎమ్మెల్యేలు(వీరిలో 9 మంది కాంగ్రెస్‌ నుంచి, ఒకరు ఏఐటీసీ నుంచి ఫిరాయించిన వారు), ఎన్‌పీఎఫ్‌ తరపున నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్‌పీఎఫ్‌ గనుక మద్ధతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఎదురుకావొచ్చు.
 నలుగురు ఎన్‌పీఎఫ్‌ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలంటూ ముఖ్యమంత్రి బిరెన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్‌పీఎఫ్‌ బిరెన్‌పై విరుచుకుపడింది. ‘మమల్ని చులకన చేసిన వారితో ఇంకా కొనసాగటం సరికాదు.. మద్ధతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం’ అని ఎన్‌పీఎఫ్‌ పేర్కొంది. ఈ పరిణామాల అనంతరం ఎన్‌పీఎఫ్‌ నేతలు ఒక్కోక్కరుగా బీజేపీ ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేయటం ప్రారంభించారు కూడా. ఫిబ్రవరి 27 నాగాలాండ్‌ ఎన్నికల తర్వాత బీజేపీతో తెగతెంపులులపై ఎన్‌పీఎఫ్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Related Posts