యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశ్వబ్రాహ్మణులకు రాజకీయం గా అన్యాయం జరుగుతుంది. 25లక్షల మంది ఉన్నా పార్టీ లు ప్రాధాన్యత కల్పించడంలేదు. చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం విఫలమయ్యారని ఆంధ్ర ప్రదేశ్ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఆరోపించారు. శుక్రవారం నాడు విజయవాడలో విశ్వ బ్రాహ్మణ ధర్మ పోరాట దీక్ష ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి పదమూడు జిల్లానుంచి ప్రతినిధులు హజరయ్యారు. దీక్షను ప్రారంభించిన ఏపీ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేశన శంకరరావు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారించాలని అన్నారు. జెఎసి ఛైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ 25లక్షల మందికి ప్రతినిధులుగా మేము దీక్ష చేపట్టాం. ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చి నిధులు కేటాయించాలి. 175స్థానాల్లో ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మణులు లేకపోవడం బాధాకరమని అన్నారు. పంచ వృత్తులు చేసుకుని జీవించే మాకు కూడా చట్ట సభలలో ప్రాతినిధ్యం వహించారు. చంద్రబాబు కు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. అందుకే రెండు రోజుల పాటు ఈ దీక్షలు చేపట్టాం. ఒక్కో జిల్లా నుంచి ఐదుగురు చొప్పున 65మంది తొలి రోజు దీక్షలో పాల్గొన్నాం. అమరావతి లో పది ఎకరాలు స్థలం కేటాయించి, శిక్షణ కేంద్రం నిర్మించాలని అన్నారు. 25లక్షల మంది విశ్వబ్రాహ్మణుల ఆకాంక్షను, న్యాయమైన కోర్కెలను చంద్రబాబు పరిష్కరించాలని కోరుతున్నామని అయన అన్నారు.