యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఫిబ్రవరి 3న జరగబేయే క్షత్రియ శంఖారావం సభ పోస్టర్ ను విజయవాడ లో ఎంపి గోకరాజు గంగరాజు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లడుతూ క్షత్రియ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ భహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 80శాతం మంది క్షత్రియజాతి కుటుంబాలు ఆర్ధికంగా వెనకబడి ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వేలాది మంది క్షత్రియులు ఈ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని క్షత్రియ కార్పొరేషన్ స్టేట్ కన్వినర్ గొట్టుముక్కల రఘురామరాజు ఈ సందర్భంగా తెలిపారు.