YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశీ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. ఇండెక్స్‌లు ఆరంభ లాభాలను నిలుపుకోలేకపోయాయి. సెన్సెక్స్ 169 పాయింట్ల నష్టంతో 36,025 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 10,780 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,953 - 36,474 పాయింట్ల రేంజ్‌లో ట్రేడవ్వగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,756 - 10,931 స్థాయిలో కదలాడింది. మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన అ‍మ్మకాలు మార్కెట్‌ను ముంచేశాయి. మారుతీ సుజుకీ, జీఎంటర్‌టైన్‌మెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్‌ సిమెంట్ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. దీంతో ఇండెక్స్‌లు ఈ వారంలో కనిష్ట స్థాయి వద్ద ముగిశాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేర్ల క్షీణత కారణంగా నిఫ్టీ 10,800 మార్కును కోల్పోయింది. నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ 20 శాతం నష్టపోయింది. డిష్‌టీవీ (37 శాతం), జీ లిమిటెడ్‌ (31 శాతం) షేర్ల భారీ పతనం ఇందుకు కారణమైంది. మారుతి సుజుకీ (8 శాతం), హీరో మోటొకార్ప్ (4 శాతం), టాటా మోటార్స్‌(5 శాతం) షేర్ల క్షీణతతో నిఫ్టీ అటో ఇండెక్స్‌ 3 శాతానికి పైగా నష్టపోయింది. రియల్టీ ఇండెక్స్‌ సైతం 4 శాతం నష్టపోయింది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హీరో మోటొకార్ప్‌, ఇండియాబుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 31 శాతం నుంచి 4 శాతం శ్రేణిలో నష్టపోయాయి. అదేసమయంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌సీఎల్ టెక్, యస్ బ్యాంక్, సిప్లా షేర్లు ఎక్కువగా పెరిగాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ 6 శాతానికి పైగా లాభపడిం

Related Posts