యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు తొలి బంతి నుంచే బ్యాట్‌కు పనిచెప్పారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 22, అంబటి రాయుడు 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.